Tuesday, January 25, 2022

కరుణామయ శివ

 కరుణామయశివ సదాశివా జాలిని చూపవయా నమఃశివ కరుణామయా శివా | 

నీవే తల్లివి నీవే తండ్రివి గురుడవు సఖుడవు నీవేనయా అండపిండ బ్రహ్మాండములంతట ఆదియోగివి నీవెనయా 

హాలాహలమును సేవించితివి శూలాయుధమును ధరియించితివి ఆపన్నులను రక్షించితివి అంధకారమును తొలగించితివి 

కపాలములే పీతాంబరములు చితాభస్మమే  శ్రీగంధములు దహిఇంచితివే  కామక్రోధములు నిర్మించావులే కైవల్యపథములు 

|| కరుణామయా || 


కపిలేశ్వరా సిద్ధేశ్వరా రామేశ్వరా బసవేశ్వరా  

ప్రమధీశ్వరా నాగేశ్వరా గిరీశ్వరా ఋష్యేశ్వరా 

నందీశ్వరా భృంగీశ్వరా సర్వేశ్వరా జగదీశ్వరా 

శరణంటిభక్తవత్సల కాపాడర విజయంకరా

కైవల్యసిద్ధిదాయక కరుణించవ భక్తవశంకరా 

త్రైలోక్యలోకపాలక దిగిరార నువు అభయంకరా




Tuesday, January 18, 2022

భజే భజే గణేశ

భజే భజే గణేశ భజే భజే గణేశ  విఘ్నవినాయక  పార్వతితనయా భజే భజే గణేశ | 

భజే భజే గణేశ భజే భజే గణేశ  నాగాభరణా షణ్ముఖసోదర భజే భజే గణేశ || 


సిద్ధిబుద్ధిప్రద సంకటమోచన ప్రసన్నవదనా  భజే  భజే గణేశ,
చేతులెత్తి శిరమువంచి  అభయము కోరేము భజే భజే గణేశ || 

ఏకదంతముతో భారతమువ్రాసిన వరదహస్తా భజే భజే గణేశ,
మనసులోని మాయలను చెరిపి జ్ఞానమొసగు భజే భజే గణేశ || 

అనింద్యసేవిత గజకర్ణశోభిత లంబోదరా భజే భజే గణేశ,
నిందలేలేని త్రోవలోనడిచే ధైర్యమునిమ్ము భజే భజే గణేశ || 

కుడుములుండ్రాళ్లు గరికపత్రితో సేవించెదము భజే భజే గణేశ,
ధర్మార్థకామమోక్ష సిద్ధికై మనసార తపించేము భజే భజే గణేశ || 

గణేశ

గణేశ భజమన గణేశ భజమన గణేశ భజమనరే |
గణేశ భజమన గణేశ భజమన గణేశ భజమనరే || 

సిద్ధిబుద్ధిప్రద సంకటమోచన ప్రసన్నవదనమదే, చేతులెత్తి శిరమువంచి  అభయమర్థించరే |  
ఏకదంతముతో భారతమువ్రాసిన వరదహస్తమదిగో,మనసులోని మాయలను చెరిపి జ్ఞానమొసగమనరే | 
అనింద్యసేవిత గజకర్ణశోభిత బొజ్జగణపతతడే, నిందలేలేని త్రోవలోనడిచే ధైర్యమునిమ్మనరే |
కుడుములుండ్రాళ్లు గరికపత్రితో గణనాథుసేవించరే,ధర్మార్థకామమోక్ష సిద్ధికై మనసార తపియించరే | 

Tuesday, April 24, 2018

రాఘవేంద్ర రాఘవేంద్రుని

రాఘవేంద్ర రాఘవేంద్రుని కొలువరే, రఘురాముని ధరిజేరే మార్గమడుగరే
రాఘవేంద్ర రాఘవేంద్రుని పిలువరే, సన్మార్గము నడిచే శక్తి నడుగరే || రా ||

మంత్రముగ్దమయ్యే బృందావనమెళదామా, గురు రాఘవేంద్ర సన్నిధిని చూచి వద్దామా
భక్తి ముక్తి నొసగే వేదమంత్రము, గురు రాఘవేంద్ర నామమే తారక మంత్రము || రా ||

గల గల గల తుంగభద్రలో స్నానము, గురు రాఘవేంద్ర చరణ సేవకు సిద్ధము
బిర బిరమని మనసెగిసే వాయువేగము, గురు రాఘవేంద్ర శరణాగతిలో లీనము || రా ||

పవనతనయ వేంకటేశ లక్ష్మీ తేజము, గురు రాఘవేంద్ర ఆత్మజ్యోతిలో దర్శనము
పరిమళము పవిత్రము పరమపావనము, గురు రాఘవేంద్ర బోధసహిత జీవనయానము || రా ||

సన్మార్గము నడిచే శక్తి నడుగరే, సన్మార్గము నడిచే శక్తి నడుగరే


Sunday, September 16, 2012

వినువీధుల్లో

వినువీధుల్లో ఎదలోయల్లో దాగిన ఓ కుసుమం, మనసా వాచా నీతోనంటూ సాగెను ఈ పయనం
దడబిడ గడగడ అలజడి రేపెను ధ్యాసే అనునిత్యం, అలలా ఎగసే శ్వాస క్షణక్షణం నీ కోసం

వెండి మబ్బులో వసంతాలు చల్లనా, స్వాతి చినుకులా నీపై పులకరించనా
పైర గాలిలో హాయినవ్వనా, సుమగంధ మిళితమై నీ మోము తాకనా

కోనేటి అలలలా కదిలే కోటి కురులపై, జాజి కొమ్మలా నే  జంట కట్టనా
సంధ్య వెలుగుల రంగు పులుముకొని, కస్తూరి తిలకమై నీ నుదుట చేరనా

బొండు మల్లెలా బంగారు ఛాయతో, నీ సమ్మోహనాల మేని రంగు అవ్వనా
ఆరు అడుగుల నా తోడు నీడతో, ఆరుమూరల తళుకు చీర చుట్టనా

చిమ్మ చీకటి నిండు రాత్రిలో నీ కంటి కాంతుల వెండి వెలుగులద్దవా
అమ్మ మాటలా జోలాలి పాటలా నీ తీపి పలుకుల రాగామాలపించవా  


Saturday, July 14, 2012

బావో

ఆ అః అఆ ఆ అః అఆ అఅఆఆ అఅఆఆ...

గుంటూరు బావో చిత్తూరు బాయ్యో రంగా'రెడ్డి' బావో సికాకులం బాయ్యో!!!
అల్ స్టేటు బావలంత నాకోసం ఎగిరిపడతరు, గలీ గలీ టెంట్లే ఏసి లొల్లి జేస్తరు

చిత్తూరు పాలకోవా రంగు నాదిరో, కోనసీమ వంపుకన్న సొంపు గుంటరో,
గరం గరం చాయ్ కన్న యేడి గుంటరో, దమాగ్ గిట్ల ఖరాబ్ జేసే సోకు నాదిరో

తెలంగాణ సక్కినాలు, గోదారి పూతరేకులు, సీమోళ్ల సంగటిముద్ద ....
ఇలా కాకుటైలు ఫుల్ మీల్సు నాతో యవ్వారం,
కూచిపూడి, కోలాటం, తీన్ మారు, డిస్కోటెక్కు, కోయడాన్సు, డప్పు...
ఇలా మిక్సు చేసి రచ్చే రచ్చ నాతో తందానం

సిరిసిల్ల, ధర్మవరం, వెంకటగిరి, పోచంపల్లి, మంగళగిరి, గద్వాలు కోకలన్నిజల్ది నాకు తెచ్చి పెట్టావా
కొండపల్లి బొమ్మల్లె, కళంకారి అచ్చల్లె, నెక్లెస్సు రోడ్డల్లె నైజాము చమకులద్ది జర్ర నా పెయింటింగ్ ఎయ్యవా

పల్నాటి పౌరుషాలు కాకతీయుల ప్రతాపాలు కలిసున్న తెలుగు హల్కు ఎక్కడున్నడు? ఆడి కోర మీసం లాగడానికి ఎయిటింగ్ ఇక్కడ

మరి వాడు కానొస్తే.....

ఒంగోలు గిత్తల్లె ఫైటు జేస్తను, పొలికేకలన్ని పెదవితోని బందు జేస్తను, పల్సు రేటు పడే దాక బరువు దింపను....

Monday, July 9, 2012

కిన్నెర

సిలకల నవ్వుల్ది కిన్నెర అరె కొరకొర సూపుల్ది కిన్నెర
బిర బిర సెంతకు వచ్చెరా, దాని సొగసుల్తో మనసంత గుచ్చెరా
కనుసైగల్తో ఊసులదేలిపెరా, మావా మనువాడ బాసల్నిజేసెరా

కొరమీనులాంటి  బుల్లిరో, హంస దీని చెల్లిరో, జుంటి తేనె పలుకురో జుర్రెయినా
సురకత్తి లాంటి సూపురో, బొండుమల్లి రంగురో, పున్నమల్లె ఎలుగురో దీని జతలోన

కోనల్లో కేకేద్దామే చిన్ని, కొండల్లో కొలువుందామే అమ్మి
పరవాన్నం పాయసాలే రంగి, జాతరలో జేజ్జనకలే మంగి

మబ్బుల్లో మెరుపోచ్చనా మావా చేతుల్లో చేయ్యేసినా
వానల్లో వరదొచ్చినా పెళ్లి బాజాలే మోగించనా ఓ పిల్లా

తానల ఆటలో,  తందనాన పాటలో, తొలిజాము సిగ్గులో, మలిజాము మత్తులో,అడవితల్లి నీడలో, గంపెడంత పిల్లలో...